‘కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే’.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

‘కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే’.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సమావేశానికి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. 2014-15లో దేశంలో 2వేల స్టాండర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 23 వేళ స్టాండర్డ్స్‌కు చేరిందని తెలిపారు.

ప్రమాణీకరణ సంఖ్యను 55 వేల వరకు పెంచడమే కూటమి ప్రభుత్వ(AP Government) లక్ష్యమని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. భారత్ తయారీ స్టాండర్డ్స్ 95శాతం హార్మోనైజ్డ్‌గా గుర్తింపు పొందాయన్నారు. హాల్‌మార్కింగ్ విషయంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 371 జిల్లాల్లో బంగారం హాల్‌మార్కింగ్ అమలులో ఉందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా ప్రతి జిల్లాలో హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి నాదెండ్ల తెలిపారు.

Next Story