Minister Nadendla:దీపం-2 పథకం పై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-20 15:32:02  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లో అమలవుతున్న దీపం–2 పథకం పై మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Minister Nadendla:దీపం-2 పథకం పై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో అమలవుతున్న దీపం–2 పథకం పై మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పథకం లబ్దిదారులు రెండో విడత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 'దీపం-2' పథకం కింద మూడో విడతలో గ్యాస్ సిలిండర్ రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ మేరకు ఇవాళ(మంగళవారం) జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల సచివాలయం నాలుగో బ్లాక్‌లో మీడియాతో మాట్లాడారు. దీపం-2 పథకం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99,700 మంది ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని మంత్రి(Minister Nadendla Manohar) తెలిపారు. ఇక రెండో విడతలో భాగంగా.. దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

Next Story