- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జూన్ 4న ఆ పండుగ నిర్వహించాలి’.. మంత్రి నాదెండ్ల కీలక పిలుపు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్టాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్టాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈరోజు(ఆదివారం) రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురంలోని సుకాలమ్మ వీధిలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రేషన్ షాపును పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి.. లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి నాదెండ్ల పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి పాలనకు ఏడాదైనా సందర్భంగా ఈ నెల(జూన్) 4వ తేదీన వేడుకలను నిర్వహించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో సంక్రాంతి, దీపావళి, కలిపి చేసుకుందాం అని వెల్లడించారు. మహిళలు ముగ్గులు వేసి కూటమి విజయాన్ని పండుగలా నిర్వహించాలని మంత్రి నాదెండ్ల కోరారు. పీడ విరగడై ఏడాది పేరుతో దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని చెప్పారు. ఈ తరుణంలో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మంత్రి నాదెండ్ల మనోమర్ పిలుపునిచ్చారు.






