కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన జారీ చేసారు.

కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన జారీ చేసారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25 నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 15 వరకు నాలుగు విడతల్లో కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. ఆగస్టు 25 నుంచి విజయనగరం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో పంపిణీ చేయనుండగా.. ఆగస్టు 30 నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరులో పంపిణీ జరగనుందని అన్నారు.

అలాగే సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి, మన్యం, కోనసీమ, అనకాపల్లిలో పంపిణీ చేయనుండగా.. సెప్టెంబర్ 15 నుంచి మిగిలిన ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా ఇంటింటికీ అందజేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల మంది లబ్ధిదారులకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్డులు ఏటీఎం కార్డు సైజులో, క్యూఆర్ కోడ్‌తో ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

Next Story