- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీడ విరగడై ఏడాది గడిచింది: మంత్రి నాదెండ్ల
పీడ విరగడై ఏడాది గడిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: పీడ విరగడై ఏడాది గడిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అలాగే వైసీపీ చేపట్టిని కార్యక్రమానికి వ్యతిరేకంగా విజయవాడ(Vijawada)లో ఆందోళనకు కూటమి నేతల పిలుపునిచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, MLA గద్దె రామ్మోహన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల .. గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు కూటమి వెంటే ఉన్నారన్నారు. అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు.
మరో మంత్రి అనగాని సత్యప్రసాద్(Satya Prasad, the minister) సైతం మీడియాతో మాట్లాడారు. సంవత్సరం పాలనలో చాలా విజయాలు సాధించాం. జగన్ పాలనలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. సైకో పాలనలో వెళ్లిపోయిన కంపెనీలకు తిరిగి రప్పించాం. నిరుద్యోగులకు ఇప్పటికే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. అన్న క్యాంటీన్ మళ్లీ ఓపెన్ చేసి పేదల ఆకలి తీరుస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.






