మామిడి లోడ్ వివాదం .. వైసీపీ గుట్టు రట్టు చేసిన మంత్రి

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా మామిడికాయల లోడ్‌ను రోడ్డుపై పారబోసిన ఘటనపై మంత్రి నాదెండ్ల రట్టు చేశారు.

మామిడి లోడ్ వివాదం .. వైసీపీ గుట్టు రట్టు చేసిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former Cm Jagan) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా మామిడికాయల(Mangoes) లోడ్‌ను ట్రాక్టర్ల(Tractors)తో పారబోస్తూ వైసీపీ(Ycp)కి చెందిన కొందరు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అయితే మామాడికాయలు పారబోసేందుకు ముందుగానే ట్రయల్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ వైసీపీ నాయకులపై విమర్శలు కురిపించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారని చెప్పారు. మామిడి కొనుగోళ్ల విషయంలో కృత్రిమ సమస్యలను సృష్టించేందుకు యత్నించారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Next Story