Minister Nadendla: కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు డెన్‌గా మార్చేశారు.. మంత్రి నాదెండ్ల ఫైర్

by Kema Shiva Kumar |

ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో కాకినాడ పోర్టు (Kakinada Port)ను స్మగ్లింగ్‌ (Smuggling)కు డెన్‌గా మార్చేశారని మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఫైర్ అయ్యారు.

Minister Nadendla: కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు డెన్‌గా మార్చేశారు.. మంత్రి నాదెండ్ల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో కాకినాడ పోర్టు (Kakinada Port)ను స్మగ్లింగ్‌ (Smuggling)కు డెన్‌గా మార్చేశారని మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఫైర్ అయ్యారు. ఇవాల ఆయన ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం (Ration Rice) అక్రమ రవాణాపై సీబీ సీఐడీ (CB CID) విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. గంగవరం (Gangavaram), కృష్ణపట్నం (Krishnapatnam), విశాఖ పోర్టు (Vishakha Port)ల కంటే కాకినాడ పోర్టు (Kakinada Port)లోనే భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని అన్నారు.

ఈ క్రమంలోనే విశాఖ పోర్టు (Vishakha Port)పై కూడా ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాకినాడ పోర్టు (Kakinada Port)ను పూర్తిగా స్మగ్లింగ్‌కు డెన్‌గా మర్చేశారని ఫైర్ అయ్యారు. గత మూడేళ్లలో 1.31 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 1,066 కేసులు నమోదు చేశామని తెలిపారు. అదేవిధంగా 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని అన్నారు. సీజ్ చేసిన మొత్తం బియ్యం విలువ రూ.240 కోట్లు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Next Story