గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

by Naga Rani Yarlagadda |

ఏపీకి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులతో భేటీ నేపథ్యంలో.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించిన కేంద్రం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్టుకు నిధులు, ఆపై పనులు ప్రారంభమైతే.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ నగరాల జాబితాలోకి చేరుతుంది. విశాఖపట్నం ఏపీ ఐటీ కారిడార్ గా అభివృద్ధి చెందుతున్న వేళ.. కేంద్రం మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story