ఏపీకి భారీగా నిధులు.. కేంద్రమంత్రికి కృతజ్ఞతలు

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ క్రీడా నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియాకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు..

ఏపీకి భారీగా నిధులు.. కేంద్రమంత్రికి కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి రూ.75 కోట్ల క్రీడా నిధులను మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియా(Union Minister Mansukh Mandaviya)కు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే(Raksha Nikhil Khadse)‎తో పాటు మాండవియాను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధికి సహకారం అందించాలని ఇద్దరు కేంద్రమంత్రులను రాంప్రసాద్ రెడ్డి కోరారు.

రాయచోటిలో ఫుట్‌బాల్ మైదానం ఏర్పాటుకు ప్రతిపాదన


రాయచోటి పట్టణంలో ఫుట్‌బాల్ మైదానం ఏర్పాటుకు ప్రతిపాదన చేయడంతో పాటు ప్రతి జిల్లాకు అదనపు ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని రాంప్రసద్ అభ్యర్థించారు. అలాగే ఖేలో ఇండియా ద్వారా రూ.675 కోట్ల క్రీడా మౌలిక సదుపాయాల కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు, కాకినాడలో జాతీయ ఉత్తమ క్రీడాకేంద్రాల మంజూరు చేయాలని కోరారు. యువతలో క్రీడా ప్రతిభ వెలికితీయడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రులకు మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విన్నవించారు.

Next Story