- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు మంత్రి మండిపల్లి గుడ్ న్యూస్
మహిళలకు యధావిధిగా ఉచిత బస్సు ప్రయాణం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రయాణీకులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipally Ramprasad Reddy) గుడ్ న్యూస్ తెలిపారు. సంక్రాంతి (Sankranthi) సందర్భంగా రాష్ట్రంలోని ప్రయాణీకులకు తీపి కబురును అందించారు. పండుగ నేపథ్యంలో బస్సు చార్జీలను పెంచడం లేదని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బస్సుల సంఖ్యను కూడా పెంచడం జరిగిందని.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ ఏడాది బస్సు చార్జీలు పెంచే ప్రతిపాదనలేవి ప్రభుత్వం వద్ద లేవన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీకి ఆదాయం సమకూర్చుకోవడంపై సంస్థ ఫోకస్ చేసిందని వివరించారు. అదే విధంగా పండుగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ పై నిఘా ఉంచామన్నారు. చార్జీలను ఇష్టారీతిన పెంచితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేల చార్జీలను పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారన్నారు. ప్రజలకు పండుగపూట ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.






