Nara Lokesh:‘రైతుల సమస్యల పరిష్కారానికి పవనన్న ప్రత్యేక చొరవ’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-22 12:28:02  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు వేశారు.

Nara Lokesh:‘రైతుల సమస్యల పరిష్కారానికి పవనన్న ప్రత్యేక  చొరవ’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు వేశారు. అయితే.. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో అడవి ఏనుగుల దాడుల వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని, పంట నష్టాన్ని తగ్గించడంలో కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఏపీ(Andhra Pradesh)కి నిన్న(బుధవారం) 6 కుంకీ ఏనుగులను రప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు.

ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్ ‘‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వాని(Karnataka Government)కి కూడా నా కృతజ్ఞతలు’’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Click For Tweet..

Next Story