‘గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదు’.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్(వీడియో)

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

‘గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదు’.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాజధాని పునర్నిర్మాణ పనులకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల(మే) 2వ తేదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు పునః ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) చేతుల మీదుగా జరగనుంది.

ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో ‘‘గ్రహణం అనేది ఎంతో కాలం ఉండదు. స్వయం ప్రకాశకాలు అయిన సూర్యచంద్రుల మాదిరిగానే... స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అయిన ప్రజా రాజధాని అమరావతి కూడా ఐదేళ్ళ గ్రహణం నుంచి బయటపడి మళ్ళీ వెలుగు బాట పట్టింది. పునర్నిర్మాణానికి సిద్ధం అవుతోంది’’ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ వీడియోను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తున్నారు.

https://x.com/naralokesh/status/1916470422796685406

Next Story