ఆసియా స్వర్ణ విజేతకు అండగా మంత్రి లోకేష్

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల ద‌క్షిణ కొరియాలోని గుమి వేదిక‌గా జ‌రిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియ‌న్ షిప్ లో విశాఖప‌ట్నంకు చెందిన జ్యోతి య‌ర్రాజీ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.

ఆసియా స్వర్ణ విజేతకు అండగా మంత్రి లోకేష్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవ‌ల ద‌క్షిణ కొరియాలోని గుమి వేదిక‌గా జ‌రిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియ‌న్ షిప్ లో విశాఖప‌ట్నంకు చెందిన జ్యోతి య‌ర్రాజీ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. ఇప్ప‌టికే జ్యోతి అనేక ప‌త‌కాలు సాధించ‌గా అర్జున వార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో జ్యోతి కుటుంబ స‌భ్య‌లతో క‌లిసి మంత్రి నారాలోకేష్ ను ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసం వ‌ద్ద కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆసియా అథ్లెటిక్స్ చాంపియ‌న్ షిప్ లో మ‌హిళ‌ల 100 మీట‌ర్ల విభాగంలో 12.96 సెక‌న్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేరి స‌రికొత్త చాంపియ‌న్ షిప్ రికార్డు అందుకున్న జ్యోతిని లోకేష్ అభినందించారు. జ్యోతి రాబోయే ఏషియ‌న్ గేమ్స్ , కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌కు స‌న్న‌ద్ద‌మౌతుండ‌గా రూ.30 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం అందించారు. మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ డ‌బ్బును అందించ‌గా కార్య‌క్రమంలో శాప్ చైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఉన్నారు.

Next Story