- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్ట్ షాపుల వల్లే నకిలీ మద్యం ఎక్కువైంది: మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
బెల్ట్ షాపుల వల్లే నకిలీ మద్యం ఎక్కువైందని మంత్రి లోకేశ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: బెల్ట్ షాపుల(Belt Shops) వల్లే నకిలీ మద్యం(Fake Liquor) ఎక్కువైందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. ములకలచెరువు కల్తీ మద్యం తయారీ ఘటనపై ఆయన స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పు చేసి టీడీపీకి రుద్దే ప్రయత్నం చేశారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల పరిధి సైతం ఎక్కువగా ఉందన్నారు. బెల్ట్ షాపులను తగ్గించే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. నకిలీ వైద్యం, మెడికల్ కాలేజీల విషయంలో తిప్పికొట్టడంలో తమ వాళ్లు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇప్పటికైనా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వైసీపీ విమర్శలను మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పి కొట్టాలన్నారు. లేని పక్షంలో పార్టీ నష్టం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరించాలన్నారు. మంచి పనులను సక్రమంగా చెప్పకపోతే నష్టం కలుగుతుందన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని మంత్రి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.






