ఎవరెస్ట్ అధిరోహించిన దివ్యాంగులు: మంత్రి లోకేశ్ ప్రశంసల వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-26 14:31:02  IST  )

శారీరక లోపాలు లక్ష్య సాధనకు అడ్డంకి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు నిరూపించారు. అసాధారణ పట్టుదలతో హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి, సముద్ర మట్టానికి 5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు....

ఎవరెస్ట్ అధిరోహించిన దివ్యాంగులు: మంత్రి లోకేశ్ ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: శారీరక లోపాలు లక్ష్య సాధనకు అడ్డంకి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు నిరూపించారు. అసాధారణ పట్టుదలతో హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి, సముద్ర మట్టానికి 5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఎముకలు కొరికే చలిని, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను ఎదిరించి వీరు సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల్లో కొత్త ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

నారా లోకేశ్ హర్షం

ఈ అద్భుత ఘట్టంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇది కేవలం ఒక కొండను ఎక్కడం మాత్రమే కాదని, సమాజంలోని అపనమ్మకాలను మరియు అవమానాలను అధిగమించి శిఖర సమానమైన ఉన్నత స్థాయికి ఎదగడమని ఆయన కొనియాడారు. వైకల్యాన్ని సాకుగా చూపే వారికి ఈ విద్యార్థుల ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సమాధానమని, వీరి పోరాట పటిమ రేపటి తరానికి ఆదర్శమని ఆయన ప్రశంసించారు.

ప్రతిభావంతలను గుర్తించడమే లక్ష్యం

ప్రత్యేక ప్రతిభావంతుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేసింది. ప్రతి ఏటా ఇలాంటి వినూత్న సాహసయాత్రల ద్వారా దివ్యాంగులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Next Story