- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు.. మంత్రి లోకేష్ ప్రశంస
నీట్ యూజీ ఫలితాలు నిన్న(శనివారం) విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: నీట్ యూజీ ఫలితాలు నిన్న(శనివారం) విడుదలైన విషయం తెలిసిందే. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో ర్యాంకులు సాధించిన ఏపీకి చెందిన ఆరుగురు విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. 19 వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాష్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92 వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దేశ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉంది అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్తులో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి లోకేష్ తెలిపారు.






