- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తక్షణమే ఆ కార్యక్రమం ప్రారంభించండి’.. మంత్రి లోకేష్ ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(జూన్ 6) మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(జూన్ 6) మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు జరిగిన మెగా డీఎస్సీ పరీక్షలు(Mega DSC Exams) ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ చేపట్టామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పారదర్శకంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పారదర్శకంగా 27వేల మంది స్కూల్ అసిస్టేంట్ల బదిలీలు, అలాగే 4 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన డీఎస్సీ పరీక్షకు మొదటి సెషన్‌లో 88శాతం, రెండో సెషన్‌లో 86శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
అక్షరాస్యతకై అక్షర ఆంధ్ర చేపట్టాలని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 15-59 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. 100 శాతం అక్షరాస్యతే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే ‘వయోజన విద్యా మిషన్’ ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వయోజన విద్యా విభాగంలో 109 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అంకిత భావం ఉన్నవారిని విద్యాశాఖ నుంచి తీసుకోవాలని సూచించారు.






