Minister Lokesh: కాసేపట్లో ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు.

Minister Lokesh: కాసేపట్లో ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌ (Parliament)లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) నుంచి బయలుదేరి హస్తినకు చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Railway Minister Ashwini Vaishnav) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 2025-26 రైల్వే వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపి సన్మానించనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కొత్తగా రావాల్సిన రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలుపనున్నారు. విశాఖపట్నం (Vishakhapatnam)ను ఐటీ (IT) హబ్‌గా, రాయలసీమ (Rayalaseema)ను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రోత్సహకాలు అందించాలని మంత్రి లోకేశ్, అశ్వినీ వైష్ణవ్‌ను రిక్వెస్ట్ చేయనున్నారు.

కాగా, 2025-26 రైల్వే వార్షిక బడ్జెట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న రైల్వే పనులను సభలో సమగ్రంగా వివరించారు. ఏపీలో రూ. 9,417 కోట్ల విలువైన రైల్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అందుకే బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని అన్నారు. గతంతో ఉన్న అధికారంలో ఉన్న యూపీఏ (UPA) హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా ఆంధ్రాకు ఫండ్స్ ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 73 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ (Telangana)లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5, 337 కోట్లు కేటాయించినట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. అతి త్వరలో కాజీపేట్ (Kazipet)లో మల్టిపుల్ రైల్వే మ్యానుఫాక్చరింగ్​యూనిట్ (Multiple Railway Manufacturing Unit)ను ప్రారంభించబోతున్నామని అన్నారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీ (ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి) కేవలం రూ.886 కోట్లు మాత్రమే కేటాయించిందని అశ్వినీ వైష్ణవ్‌ కామెంట్ చేశారు.

Next Story