జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో మంత్రి లోకేశ్ భేటీ

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-21 11:11:46  IST  )

మంత్రి లోకేష్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో లోకేష్ భేటీ అయ్యారు.

జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో మంత్రి లోకేశ్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి లోకేష్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో లోకేష్ భేటీ అయ్యారు. గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని యుకియో కానిని కోరారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియా సరఫరాకు రాష్ట్రంలోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని అడిగారు. అంతే కాకుండా ఆర్ఎంజడ్ సంస్థతోనూ లోకేష్ చర్చలు జరిపారు. దీంతో విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్ 1 ఐటీ పార్క్ లో జీసీసీ పార్క్ అభివృద్ధి చేయ‌డానికి, లాజిస్టిక్ పార్కును అభివృద్ధి చేయ‌డానికి రాబోయే ఐదేళ్ల‌లో ల‌క్ష కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

READ MORE ....

ఒక్క వాట్సాప్ సందేశంతో వ్యాపారానికి సహాయం : నారా లోకేశ్

Next Story