Minister Lokesh : కేంద్ర విద్యాశాఖ మంత్రితో మంత్రి లోకేశ్ భేటీ

by Ramesh Naini |

రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు మద్దతుగా నిలవాలని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Minister Lokesh : కేంద్ర విద్యాశాఖ మంత్రితో మంత్రి లోకేశ్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు మద్దతుగా నిలవాలని ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ (సోమవారం) కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పఠనం, గణన వంటి కనీస నైపుణ్యాలు సాధించేందుకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయనకు వివరించారు.

అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ రెస్పాన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని కేంద్రమంత్రికి తెలిపారు. చిన్న వయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేసేందుకు రాజ్యాంగ దినోత్సవం నాడు ‘‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’’ పేరుతో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించామని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.

Next Story