- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరగా ప్రాథమిక అంచనాలు ఇవ్వండి: తుపాను నష్టంపై మంత్రి లోకేశ్ ఆదేశాలు
తుపాను నష్టంపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు పలుచోట్ల వరదలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను(Cyclone Montha) తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్(Minister Lokesh) సమీక్ష నిర్వహించారు మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
READ MORE .....






