కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థుల మృతి.. మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

by Jakkula Mamatha |
కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఏపీ  విద్యార్థుల మృతి.. మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లో మంత్రాలయం(Mantralayam) విద్యార్థుల రోడ్డు ప్రమాదం పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు. రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed