అమెరికా టూర్‌లో మంత్రి లోకేష్ బిజీబిజీ.. టెక్ దిగ్గజాలతో వరుసగా కీలక భేటీలు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, డీప్ టెక్, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.

అమెరికా టూర్‌లో మంత్రి లోకేష్ బిజీబిజీ.. టెక్ దిగ్గజాలతో వరుసగా కీలక భేటీలు
X

దిశ, వె‌బ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, డీప్ టెక్, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)లో ఆయన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ దిగ్గజాలతో వరుసగా భేటీలు నిర్వహించారు. సెలెస్టా క్యాపిటల్ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌ (Arun Kumar)తో జరిగిన చర్చల్లో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ (Deep Tech Innovation Hub) ఏర్పాటు చేయాలని, సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విశాఖపట్నం ఇప్పటికే ఐటీ, డేటా హబ్‌గా శరవేగంగా ఎదుగుతోందని వివరించారు. రాష్ట్రంలో అత్యాధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

అనంతరం మంత్రి లోకేశ్ ప్రపంచ ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫాం కాన్వా (Canva) చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రాబ్ గిగ్లియో (Rob Giglio), ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్‌మాట్‌ (Jason Wilmott)లతో కూడా లోకేష్ సమావేశమయ్యారు. అమరావతిలో అభివృద్ధి చేస్తున్న ‘అమరావతి క్రియేటివ్ ల్యాండ్’ (Amaravati Creative Land) ప్రాజెక్టులో క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో భాగస్వామ్యంతో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. రాజధాని అమరావతిలో ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని కూడా అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం, యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ఈ పర్యటన కీలకమవుతుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి.

Next Story