మోడల్‌ ఎడ్యుకేషన్‌‌పై లోకేశ్ ఫోకస్.. DEOలు, APCలకు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

అమరావతిలో DEO, APCలతో మంత్రి నారా లోకేశ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు, మోడల్ ఎడ్యుకేషన్ దేశానికే దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు..

మోడల్‌ ఎడ్యుకేషన్‌‌పై లోకేశ్ ఫోకస్.. DEOలు, APCలకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో DEO, APCలతో మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు, మోడల్ ఎడ్యుకేషన్ దేశానికే దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాల వయసున్న ప్రతి బిడ్డ బడిలో ఉండేలా 100 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నాణ్యతను మరింత పెంపొందించడానికి సరికొత్తగా 'స్టార్ రేటింగ్' విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ రేటింగ్ విధానం ద్వారా స్కూళ్లలో వసతుల స్థాయిని పర్యవేక్షిస్తూ, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

Next Story