- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad:ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ పై మంత్రి లోకేష్ అసంతృప్తి.. కీలక ఆదేశాలు జారీ
by Jakkula.Mamatha |
హైదరాబాద్(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహణ లోపం పై ఏపీ మంత్రి(AP Minister) నారా లోకేష్(Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు.

X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహణ లోపం పై ఏపీ మంత్రి(AP Minister) నారా లోకేష్(Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు(జనవరి 18) ఎన్టీఆర్(Sr.NTR) 29 వర్ధంతి సందర్భంగా ఘాట్‌కు వెళ్లిన నారా లోకేష్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడి పోవడం, లైట్లు విరిగిపడి ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ పై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతులు తీసుకొని సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. కాగా ఘాట్ నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని గత తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు.
Next Story






