అద్భుతమైన రాజకీయ అరంగేట్రం... టీవీకే విజయ్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-04 10:01:14  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన రాజకీయ అరంగేట్రం చేసిన టీవీకే అధినేత, హీరో విజయ్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు...

అద్భుతమైన రాజకీయ అరంగేట్రం... టీవీకే విజయ్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamilnadu Assembly Elections) అద్భుతమైన రాజకీయ అరంగేట్రం చేసిన టీవీకే అధినేత, హీరో విజయ్‌(TVK Chief Hero Vijay)కు ఏపీ మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర ఓటర్ల మారుతున్న ఆకాంక్షలను ప్రతిబింబించడమే కాకుండా తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయని ఆయన చెప్పారు. విజయ్ తన ప్రజా జీవితంలో ప్రజల అంచనాలకు అనుగుణంగా పూర్తి బాధ్యతతో, అంకితభావంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. విజయ్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

లోకేశ్ ట్వీట్

Next Story