‘తెలుగు సినీ రంగానికి తీరని లోటు’.. కోటా శ్రీనివాసరావు మృతిపై మంత్రి లోకేష్ సంతాపం

by Jakkula.Mamatha |

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు(83) ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

‘తెలుగు సినీ రంగానికి తీరని లోటు’.. కోటా శ్రీనివాసరావు మృతిపై మంత్రి లోకేష్ సంతాపం
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు(83) ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ(Andhra pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ‘‘ప్రముఖ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజా సేవ తోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story