- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిభాషా వివాదం.. స్టాలిన్‌పై లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు
భాషపై రాజకీయం సరికాదని తమిళ సీఎం స్టాలిన్‌పై లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తమినాళనాడు(Tamilanadu)లో హిందీ భాష(Hindi Language)పై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం(National Education Policy)పై డీఎంకే, బీజేపీ నాయకులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. త్రిబాషా సూత్రం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin)తో పాటు అక్కడి ఎంపీలు సైతం ఆరోపిస్తున్నారు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కాదని, తమిళ్, ఇంగ్లీష్ విధాన్నాన్ని మాత్రమే తమ రాష్ట్రంలో అమలు చేస్తామని డీఎంకే లీడర్లు అంటున్నారు. దీంతో కేంద్రానికి, తమిళ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది.
అయితే ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తాజాగా స్పందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై పరోక్షం వ్యాఖ్యలు చేశారు. మాతృభాష కచ్చితంగా కీలకమైందని, త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు. పక్క రాష్ట్రాలు కొన్ని అపోహలు కలిగిస్తున్నాయని వ్యా్ఖ్యానించారు. మాతృ భాషను కాపాడుకోవాలని అటు కేంద్రం సైతం స్పష్టంగా చేప్పిందని పేర్కొన్నారు. కానీ భాష చుట్టూ రాజకీయం చేయడం సరికాదని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.






