- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్యాగానికి మానవరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు : మంత్రి లోకేశ్
త్యాగానికి మానవరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని నారా లోకేశ్ కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవరూపంగా నిలిచారని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. శాఖమూరులో 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రం రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి విగ్రహం తెలుగువారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్నారు. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కితాబిచ్చారు. తన దీక్షకు ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే రోడ్డుపైనే దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారని గుర్తుచేశారు. నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని అమరజీవి పోరాడారని లోకేశ్ గుర్తు చేశారు. ఇక రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతంగా సేవ చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. త్వరలోనే పొట్టిశ్రీరాములు పేరుపై ఒక కాయిన్ ను విడుదల చేస్తామని ఆర్యవైశ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.






