ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి ఇలా చేయండి: మహిళలకు మంత్రి లోకేశ్ పిలుపు

by Vemula.Srinu Prasad |

ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి ఇలా చేయండని మహిళలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు..

ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి ఇలా చేయండి: మహిళలకు మంత్రి లోకేశ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మహిళల(Women)కు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) కొనసాగుతోంది. ఆగస్టు 15 సందర్భంగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో మహిళలు ఆర్టీసీ బస్సు(RTC BUs)ల్లో ఉచిత ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచితంగా బస్సులో ప్రయాణించి ఆ టికెట్లతో సెల్ఫీ దిగి #FREEbusTicketSelfieకి టాగ్ చేయండండి మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రతి ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనమని, స్వేచ్చకు, గౌరవానికి ప్రతీకని లోకేశ్ తెలిపారు. ఇది ప్రయాణం కాదని, ఓ కదలిక, స్వేచ్చాయుత, సమాన అవకాశమని చెప్పారు. స్త్రీ శక్తి ద్వారా కూటమి ప్రభుత్వం మహిళల సాధికారితకు పట్టంకట్టిందన్నారు. ‘‘చెల్లెల్లు...ఈ ప్రయానాన్ని వేడుకగా నిర్వహించుకుందాం. మీ ప్రీ బస్సు టికెట్‌తో సెల్పీ దిగి ఈ ప్రపంచానికి సాధికారిత అంటే ఎలా ఉంటుందో చూపించండి.’’ అని అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story