‘మీరేం చేశారంటూ నిలదీయాలి’.. ప్రజలకు మంత్రి నిమ్మల పిలుపు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో గత ప్రభుత్వ పాలన పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.

‘మీరేం చేశారంటూ నిలదీయాలి’.. ప్రజలకు మంత్రి నిమ్మల పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో గత ప్రభుత్వ పాలన పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) ఐదేళ్ల పాలనలో సీఎంఆర్‌ఎఫ్ నిధులను పక్కదోవ పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) దుయ్యబట్టారు. ఇవాళ(గురువారం) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 82 మందికి రూ.61 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం(AP Government)లో మేలు జరిగిన ప్రతి ఒక్కరు నిజాన్ని పదిమందికి చెప్పాలని.. గత ఐదేళ్ల కక్షలు, వేధింపులు, రాక్షస పాలన అందించి రూపాయి పని చేయలేని వైసీపీ నాయకులు మన గ్రామాలు, ఇళ్ల వద్దకు వస్తే మీరేం చేశారంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర విధ్వంసంతో పాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

గత ఐదేళ్ల వైసీపీ(YSRCP) విధ్వంస పాలనతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న సీఎం సహయనిధి పునరుద్ధరించారని గుర్తు చేశారు. ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించాల్సిన నిధులను సైతం కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన వనరులను దోచుకోవడానికి ఆరాటపడుతున్నారని ఆరోపించారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపం లేని ఆయనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.

Next Story