- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు’.. మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రజాస్వామ్య స్ఫూర్తి తో పని చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పేర్కొన్నారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రజాస్వామ్య స్ఫూర్తి తో పని చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పేర్కొన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం పై మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సత్య వర్ధన్ ను వల్లభనేని వంశీ ప్రోద్బలంతో వైసీపీ నేతలు(YCP Leaders) కిడ్నాప్ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నేడు అదే కేసులో వంశీ అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఫిర్యాదు చేసిన దళితుడిపై తిరిగి కేసులు పెట్టి వేధించడం మాజీ సీఎం జగన్ రెడ్డి దుర్మార్గాలకు నిదర్శనం అంటూ మండిపడ్డారు.
బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోనే వంశీపై కేసు నమోదైంది మంత్రి తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డి(Former CM Jagan) అండతో విర్రవీగిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన టీడీపీ కార్యాలయాన్ని(TDP Office) తగులబెట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాలను జగన్ ముఠా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో, మట్టి మాఫియా, బియ్యంతో, బూతులతో జిల్లాల్లో రాజకీయాలను నీచంగా తయారు చేశారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి వైఎస్ జగన్(YS Jagan) దగ్గర మెప్పు పొందాలని అనుకున్నారు. కానీ.. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు.






