- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరి : మంత్రి కొల్లు రవీంద్ర
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక రవాణాలో బిల్లలు తప్పనిసరి అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక రవాణాలో బిల్లలు తప్పనిసరి అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మైన్స్, జియాలజీ శాఖ పనితీరుపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక తవ్వకం, రవాణా వివరాలు ఏపీ ఎస్ఎంఎస్ ద్వారా కంప్లీట్ డిజిటల్ పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇసుక లభ్యత, అతి తక్కువ ధరలపై ప్రజలకు నమ్మకం కలిగేలా క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.
Next Story






