చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

by Thanuru Gopichand |

వైసీపీ నేతలు చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. అనే విధంగా తయారయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు..    వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : వైసీపీ నేతలు చెప్తే వినరు.. గిల్లితే ఏడుస్తారు.. అనే విధంగా తయారయ్యారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకులు సంయమనంతో ఉన్నారు కాబట్టి.. వైసీపీ నేతలు ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని కామెంట్​చేశారు. ప్రజల మద్దతు చూసి ఓర్వలేక కూటమిపై జగన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల పేరుతో రాజకీయం చేయడానికి జగన్ సిగ్గుపడాలన్నారు. అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల్ని రెచ్చగొట్టడం మాత్రమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ జగన్ నీచ ఆరోపణలు చేస్తున్నాడు.. ఐదేళ్లలో జగన్ ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు.

బందరు మెడికల్ కాలేజీ పనులు ఎంత చేశారో జగన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి రూ.6 వేల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. పనులు పూర్తయిన తరువాత తిరిగి ప్రభుత్వానికే అప్పగించేలా ఏర్పాట్లు చేస్తే విమర్శలు అర్థరహితం అన్నారు. గత ఐదేళ్లు పీజీ సీట్లను నిర్వీర్యం చేసిన నీచ సంస్కృతి జగన్ రెడ్డిది అన్నారు. టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తాం అని జగన్ మాట్లాడటం సిగ్గు చేటు.. ఇలాంటి మూర్ఖుడికి ప్రజా జీవితం ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.

Next Story