గడ్డి పెట్టినా.. ఎందుకింత ఏడుపు..?

by Vemula.Srinu Prasad |

జనం గడ్డి పెట్టినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు..

గడ్డి పెట్టినా.. ఎందుకింత ఏడుపు..?
X

దిశ, వెబ్ డెస్క్: జనం గడ్డి పెట్టినా జగన్‌కి ఇంకా బుద్ధి రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ(Tdp) కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా నడచుకుంటే జగన్‌ని ప్రజలు తరిమి తరిమి కొట్టడంతధ్యమన్నారు. మెడికల్ కాలేజీల అభివృద్ధిపై వైసీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు పీపీపీ(PPP) పద్ధతిలో రోడ్లను అభివృద్ధి చేయడం వల్లనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సదుపాయం పెరిగిందని చెప్పారు. పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని, నాడు తీసుకున్న సంస్కరణల కారణంగానే ఇంత స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. తర్వాత వచ్చిన పాలకులు అభివృద్ధిని కొనసాగించారని గుర్తు చేశారు. కానీ నేడు జగన్ వైఖరే విధ్వంసం అని, అధికారంలోకి వస్తే.. పీపీపీ పద్దతిలో ఆస్పత్రుల అభివృద్ధికి ముందుకొచ్చిన కంపెనీల్ని తరుముతానని బెదిరించడం దుర్మార్గమన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదని కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు.

‘‘కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ.. పీపీపీ విధానాన్ని సమర్ధించింది. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసినప్పటికీ.. అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. ఆస్పత్రిని నిర్మించి, నిర్వహించే బాధ్యతలు ప్రైవేటుకు ఇస్తుంటే ఎందుకింత ఏడుపు.?. మెడికల్ కాలేజీలను వీలైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో విద్యార్ధులకు సీట్లు పెరుగుతాయి. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇంతమేలు జరుగుతున్నందున వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారు. దొంగ సంతకాలు పెట్టి గవర్నర్ గారికి లేఖలిచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే ప్రైవేటుపరం ఎందుకు అవుతుందో జగన్ రెడ్డి బుర్ర పెట్టి ఆలోచించాలి. గత ఐదు సంవత్సరాలు బెదిరింపు ధోరణి కారణంగానే పెట్టుబడులు తరిమేసి, పారిశ్రామిక వేత్తల్ని తరిమేసి అవస్థలపాలు చేశారు. కానీ నేడు చంద్రబాబునాయుడి దూర దృష్టితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన కార్యదక్షతకు నిదర్శనంగానే ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Next Story