నాలుగు ఛానళ్లు పెట్టుకుని హంగామా చేస్తున్నారు: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

నాలుగు ఛానళ్లు పెట్టుకుని హంగామా చేస్తున్నారు: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: నెలకి ఒకటి, రెండు సార్లు బెంగళూరు(Benguluru) నుంచి ప్రత్యేక విమానంలో రావడం.. వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేయడం జగన‌కు ఆనవాయితీ వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) విమర్శించారు. తాడేపల్లి వైసీపీ(Tadepalli Ycp) కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై విమర్శలు చేసిన వైఎస్ జగన్‌(Ys Jagan)కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాలుగు గోడల మధ్య మూడు గంటల ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి సాధించిందేంటని ప్రశ్నించారు. ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు.. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కనీసం ప్రెస్ అందరినీ పిలిచి వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నాని విమర్శించారు. ఒకే గదిలో మూడు గంటల పాటు జగన్ ప్రెస్ మీట్ పెట్టాడని, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేశ్‌ను అద్భుతమైన వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా..? అని పనిలదీశారు. పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో నుంచి డబ్బులు కోట్టేసిన వారిని వెనుకేసుకోచ్చి భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.

Next Story