పేర్ని నాని బందరు పిచ్చోడు కాదు.. రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు : మంత్రి కొల్లు

by Naga Rani Yarlagadda |

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) బందరు పిచ్చోడు మాత్రమే కాదని, రాష్ట్రానికే పెద్ద పిచ్చోడని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra). కొన్నిరోజులు పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

పేర్ని నాని బందరు పిచ్చోడు కాదు.. రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు : మంత్రి కొల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) బందరు పిచ్చోడు మాత్రమే కాదని, రాష్ట్రానికే పెద్ద పిచ్చోడని ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra). కొన్నిరోజులు పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కొందరు వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు చల్లగా ఉంటే జగన్‌కు కడుపుమంటగా ఉంటుందన్నారు.

తాను ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేర్నినాని ఆరోపిస్తున్నారని, తానెక్కడా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడానికి రెడీ.. పేర్ని నాని కూడా ఇందుకు సిద్ధమేనా ? అని సవాలు చేశారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని, రవాణాశాఖ మంత్రిగా పేర్ని నాని పనిచేశారని, వీరిద్దరూ అమాయకుల పేర్లపై కోట్లాది రూపాయల రుణాలు దండుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగపట్టాలను పంపిణీ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. పేర్నినాని కులాలు, కుటుంబాల మధ్య గొడవలు సృష్టించే స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు. రప్పా రప్పా నరికేయమని చెప్పే వారు సైకోలా లేక అలా అనడం తప్పని చెప్పే తాము సైకోలమా ప్రజలకు తెలుసన్నారు.

Next Story