బీసీ ఉద్యోగులకు మంత్రి కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |

ఒకే తాటిపై ఉండాలని బీసీ ఉద్యోగులకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు..

బీసీ ఉద్యోగులకు మంత్రి కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల మంది బీసీ ఉద్యోగులు(Bc Employees) ఒక్క మాట ఒకే బాట అనేలా నడవాలని.. అప్పుడే మన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(Bc, Obc Employees Welfare Association) ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీసీలందరినీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీలను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మేరకు స్థలం కేటాయించి, తోడ్పాటు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీలను అందిస్తామన్నారు. బీసీ జన గణన చేయాలని తీర్మానించామని, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు.

‘‘ఒకప్పుడు బీసీలు అంటే ఓటర్లుగా మాత్రమే ఉండేవారు. కానీ, టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీలను ఓటర్లుగా కాకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. సంక్షేమ పథకాల్లో భాగస్వాముల్ని చేశారు. గతంలో నేను బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో అనేకానేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశాం. విదేశీ విద్య లాంటి పథకాలు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న పథకాలను గత ఐదేళ్లు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. కేంద్రం బీసీల కోసం కేటాయించే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుందాం.’’ అని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

Next Story