- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ వద్దు బ్రో... మంత్రి విజ్ఞప్తి
డ్రగ్స్ వద్దు బ్రో... మంత్రి విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు(Minister Kinjarapu Atchannaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ యాత్రలో జిల్లా ఎస్పీ, ఎన్డీయే కూటమి నేతలు, విద్యార్థులు, యువతతో కలిసి స్వయంగా సైకిల్ తొక్కానని చెప్పారు. ఈ సందర్భంగా యువతకు నా విన్నపం ఒక్కటే.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు( Drugs) బానిసలై మీ విలువైన జీవితాలను, తల్లిదండ్రుల కలలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యవంతమైన, వ్యసన రహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే మన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ "డ్రగ్స్ వద్దు బ్రో" #SayNoToDrugs అనే నినాదాన్ని గుండెల్లో నింపుకుని, సమాజ మార్పులో భాగస్వాములు కావాలి.. మన రాష్ట్రం.. మత్తు రహిత రాష్ట్రం కావాలని పిలుపునిచ్చారు.






