నామినేటెడ్ పదవులు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నామినేటెడ్ పదవులు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

నామినేటెడ్ పదవులు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న త్రివిక్రమరావు (విక్రమ్ పూల)తో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష గొప్పతనం, కళా–సాంస్కృతిక వైభవం ప్రపంచానికి తెలియజేయడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఈ దిశగా విక్రమ్ పూల వంటి విలువలతో కూడిన రచయిత, పాత్రికేయుడు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా రావడం ఎంతో ఆనందకరమని హర్షం వ్యక్త చేశారు.

సంబంధిత రంగానికి చెందిన ప్రతిభావంతులకే నామినేటెడ్ పదవులు అప్పగించే మంచి పద్ధతిని పాటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధికార భాషా సంఘం భవిష్యత్ కార్యక్రమాలు రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలనే కూటమి ప్రభుత్వ విధానం విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి బలమైన పునాది. రాబోయే రోజుల్లో భాషా–సాంస్కృతిక విధానాలను మరింత బలోపేతం చేస్తూ తెలుగు ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.

Next Story