దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేత వాజ్‌పేయి

by Gantepaka Srikanth |

దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేత వాజ్‌పేయి

దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేత వాజ్‌పేయి
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో, భారతదేశ గౌరవాన్ని విశ్వవేదికపై నిలబెట్టి రాజకీయ విలువలు, సిద్ధాంతాలతో కూడిన పాలనకు చిరునామాగా నిలిచిన అజాతశత్రువు నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. స్వర్ణ చతుర్భుజి, గ్రామ సడక్ యోజన, అంత్యోదయ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పథకాలతో దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేత వాజ్‌పేయి. పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. విదేశాంగ మంత్రిగా ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత వాజ్ పేయిది.

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు కావడం చారిత్రాత్మకమైన శుభ సందర్భం. ఇది రాజకీయంగా, పరిపాలన పరంగా తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వేగంగా ముందుకు సాగుతోంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధానిని దేశంలోనే ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు.

Next Story