- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని వివాదాలు సృష్టిస్తే సహించం.. మంత్రి హెచ్చరిక
చిత్ర పరిశ్రమను అడ్డం పెట్టుకొని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించబోమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమను అడ్డం పెట్టుకొని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించబోమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) వార్నింగ్ ఇచ్చారు. జూన్ 1వ నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య అనుకూల వాతావరణం ఉంది. టికెట్ రేట్లు, షూటింగ్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. సినీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫిల్మ్ పాలసీ రూపకల్పన జరుపుతున్నట్లు తెలిపారు. సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
చిత్రపరిశ్రమ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
— Kandula Durgesh (@kanduladurgesh) May 24, 2025
సినీ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించం. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, డిస్ట్రిబ్యూటర్లు,… pic.twitter.com/FVvJwhNvKt






