- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరీఫ్ సీజన్‌కు గోదావరి నీరు విడుదల : తూర్పు డెల్టా రైతుల్లో హర్షం
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్ సీజన్ కోసం తూర్పు డెల్టాకు గోదావరి నీటిని మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంత్రి కందుల దుర్గేష్ ఖరీఫ్ కోసం సాగునీటిని విడుదల చేశారు. కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి తొలుత ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి నదికి జలహారతిని సమర్పించి.. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువకు నీటిని విడుదల చేయడంతో.. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ఆయకట్టు రైతులు సాగునీటి విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశామని, తూర్పు డెల్టా కాలువ ద్వారా 85 వేల ఎకరాలకు సాగునీటిని రిలీజ్ చేశామని తెలిపారు. దీని ద్వారా నిడదవోలు, కొవ్వూరులో 41 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతులు త్వరగా నాట్లు వేసుకోవాలని సూచించారు. అలాగే సాగునీటి సంఘాల ద్వారా కాలువల మరమ్మతులు చేపడుతామని, దశలవారీగా గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.






