ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్

by Thanuru Gopichand |

నిడదవోలు (Nidadavole) నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యుడు కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : నిడదవోలు (Nidadavole) నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యుడు కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. మంత్రి వద్ద తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపించాలని కోరారు. వ్యక్తిగత, సామాజిక సమస్యల వంటివి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భూ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల లోపాలు, వివిధ రకాల సమస్యల గురించి తెలిపారు. వాటికి పరిష్కారం చూపించి తమకు, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ప్రజలు కోరారు.

వారి వినతులపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ఎంతో ఓర్పుగా వారి ఫిర్యాదులను స్వీకరించారు. వాటి గురించిన సమగ్ర సమాచారాన్ని అక్కడికక్కడే సేకరించారు. సమస్య ప్రాధాన్యం బట్టి వాటికి అవసరమైన తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫోన్ కాల్ చేసి సమస్యల గురించి వివరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయని, ప్రతి సమస్యను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నిడదవోలు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు.

Next Story