- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంట హత్యలపై స్పందించిన మంత్రి గొట్టిపాటి
పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో దారుణం చోటుచేసుకున్న సంగతి విదితమే. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరామమూర్తిలను గుర్తు తెలియని వ్యక్తులు (Brothers Murder) వేటకొడవళ్లతో హత్య చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో దారుణం చోటుచేసుకున్న సంగతి విదితమే. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరామమూర్తిలను గుర్తు తెలియని వ్యక్తులు (Brothers Murder) వేటకొడవళ్లతో హత్య చేశారు. వీరిద్దరూ టీడీపీ సానుభూతిపరులుగా పోలీసులు గుర్తించారు. వీరి హత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. ఇటీవల ఇదే జిల్లాలో జరిగిన టీడీపీ కార్యకర్తల హత్యల నేపథ్యంలో ఈ ఘటన మరోసారి కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీరియస్ గా స్పందించారు. నేరుగా జిల్లా ఎస్పీతో జంట హత్యల విషయమై ఫోనులో మాట్లాడారు. జిల్లా ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ఎస్పీకి పలు ఆదేశాలను ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పాత నేరస్తులు, రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలని, ఎంతటివారైనా వదలొద్దని పోలీసులకు తెలిపారు.






