ఆలయాలకు విద్యుత్ సరఫరాపై మంత్రి గొట్టిపాటి సమావేశం

by Naga Rani Yarlagadda |

శివాలయాలు, వాటి పరిసర ప్రాంతాల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆలయాలకు విద్యుత్ సరఫరాపై మంత్రి గొట్టిపాటి సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: శివాలయాలు, వాటి పరిసర ప్రాంతాల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరం ఉండకూడదని సూచించారు. పండుగ సమయంలో భక్తులకు కరెంటు కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల్లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తితే.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను చెక్ చేయాలని, ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Next Story