రైతులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కరెంట్ కంటిన్యూ

by Vemula.Srinu Prasad |

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు..

రైతులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కరెంట్ కంటిన్యూ
X

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్(Free Current) ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravi Kumar) తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంలో ఎలాంటి మార్పులులేన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో జగన్‌(Jagan)కు సంబంధించిన పత్రిక ప్రజలను తప్పు దోవ పట్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎస్సీ, ఎస్టీ(Sc, St)లకు ఉచిత విద్యుత్ తీసేస్తున్నట్లు ప్రచారం చేశారన్నారు. మొన్నటి వరకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసికొట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి తెరలేపారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ విధ్వంస పాలనకు, చంద్రబాబు(Chandrababu) సంక్షేమ పాలనకు మధ్య చాలా తేడా ఉందని గొట్టిపాటి రవి కుమార్ ఎద్దేవా చేశారు.

Next Story