కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ - మంత్రి గొట్టిపాటి

by Naga Rani Yarlagadda |

పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ మినీ మహానాడు (TDP Mini Mahanadu) కార్యక్రమం నిర్వహించింది.

కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ - మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ మినీ మహానాడు (TDP Mini Mahanadu) కార్యక్రమం నిర్వహించింది. పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో (Bhuvana Chandra Town Hall) నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని తెలిపారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమంపై బాధ్యత తీసుకుంటుందని, ఏ కార్యకర్త ఆపదలో ఉన్నా ఆదుకుంటుందన్నారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడును అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని, కార్యకర్తలు, నేతలకు పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

Next Story