- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్‌శాఖపై జగన్రూ.1.25 లక్షల కోట్ల అప్పు : మంత్రి గొట్టిపాటి
యాక్సిస్రెన్యూవబుల్ఎనర్జీ బ్రూక్షీల్డ్తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం పీక్అవర్స్లో విద్యుత్‌ను రూ.9.38కి కొనుగోలు చేసిందన్నారు.

దిశ, డైనమిక్‌బ్యూరో/ వెబ్‌డెస్క్: రాష్ట్ర బాగు కోసం జగన్‌కు మనసు రావడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత మీడియా ద్వారా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యాక్సిస్రెన్యూవబుల్ఎనర్జీ బ్రూక్షీల్డ్తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం పీక్అవర్స్లో విద్యుత్‌ను రూ.9.38కి కొనుగోలు చేసిందన్నారు. అదే పీక్అవర్స్లోనూ రూ.4.60కే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. జగన్ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.5.12కు కొనుగోలు చేసుకుందన్నారు. సెకీ నుంచి రూ.2.49కే ప్రభుత్వం కొనుగోలు చేసిందనేది అవాస్తవమన్నారు. అన్ని ఖర్చులు కలిపి వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్రూ.5కు కొన్నారని తెలిపారు. యాక్సిస్బ్రూక్షీల్డ్సంస్థ రైతుల నుంచి రూ.1,700 ఎకరాలు లీజు తీసుకుందన్నారు. రైతులకు ఎకరాకు రూ.31 వేలు ఫీజు చెల్లించేలా ఒప్పందం జరిగిందన్నారు. ప్రతి రెండేళ్లకు లీజును 5 శాతం పెంచేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. విద్యుత్‌శాఖపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ ఆ శాఖను నాశనం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం పెంచిన ఛార్జీలను ఇప్పటికీ ప్రజలు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాగా.. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.






