- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో రూపాయి బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రూపాయి బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) అన్నారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. డెంకాడ మండలం పెద్దతాడివాడలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు మరో మంత్రి కొండపల్లితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ రూ. 2.8 కోట్లతో నిర్మించనున్న సబ్ స్టేషన్‌కు శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు. లో ఓల్టేజ్ సమస్యలకు చెక్కు పెట్టేందుకే సబ్ స్టేషన్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. తీర ప్రాంతాల విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో విద్యుత్ శాఖ దోపిడీకి గురైంది తప్ప అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. విద్యుత్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేయరాదని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు.






